భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) బలగాలు సమర్థవంతంగా అడ్డుకోవడంతో, శుక్రవారం తెల్లవారుజామున సాంబా సెక్టార్ లో ఉగ్రవాదులతో ఎదురుదాడి జరిగింది. సర్వేలెన్స్ కెమెరాల ద్వారా ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన బీఎస్ఎఫ్, వెంటనే అప్రమత్తమై, కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమై, పాక్ సైనిక పోస్ట్ కూడా ధ్వంసమైంది. అయితే, మృతుల సంఖ్యపై బీఎస్ఎఫ్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సర్వేలెన్స్ కెమెరా ఫుటేజీని భద్రతా బలగాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Read More : పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు

2 thoughts on “ఉగ్రవాదుల చొరబాటును బీఎస్ఎఫ్ సమర్థవంతంగా అడ్డుకుంది”
Comments are closed.