ధనశ్రీకి రూ.4.75 కోట్ల అలిమనీ చెల్లించనున్న చాహల్

YUZVENDRA CHAHAL & DHANASHREE

ప్రముఖ భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)కు విడాకుల అనంతరం రూ.4.75 కోట్ల అలిమనీ చెల్లించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ విడాకుల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్న ఉద్దేశంతో కోర్టును సంప్రదించి, సాధారణంగా విధించే ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

గతంలో చాహల్ తన భార్యకు భారీ మొత్తంగా రూ.60 కోట్లు అలిమనీగా చెల్లించాల్సి వస్తుందని కొన్ని వదంతులు వ్యాపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ వార్తల్లో నిజం లేకపోగా, చాహల్ నిజంగా చెల్లించాల్సిన మొత్తం రూ.4.75 కోట్లుగా తేలింది.

గత కొంతకాలంగా చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వివాహ జీవితంపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న తరుణంలో విడాకుల ప్రక్రియ ప్రారంభమైందని సమాచారం. కాగా, ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను తొలగించాలని వీరిద్దరూ కోర్టును కోరడం గమనార్హం.

Read More

One thought on “ధనశ్రీకి రూ.4.75 కోట్ల అలిమనీ చెల్లించనున్న చాహల్

Comments are closed.