వైఎస్ జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతున్న వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రజా సమస్యలపై జగన్‌కి నైతిక హక్కు లేదు: షర్మిల

“ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కి లేదు,” అంటూ షర్మిల ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు మద్యం మాఫియాను ప్రోత్సహించారని తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వాళ్లు చనిపోతున్నా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జలయజ్ఞం ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

“వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పిన జగన్, చివరకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయారు?” అని షర్మిల నిలదీశారు.

బలప్రదర్శనలు చేస్తున్న జగన్ – షర్మిల విమర్శ

జగన్ చేస్తున్న పర్యటనలపై కూడా షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. “ఇవి ప్రజల పక్షంలో పర్యటనలు కాదు, బలప్రదర్శనలు మాత్రమే. ఆయన బలప్రదర్శనల వల్ల ఇప్పటికే ముగ్గురు మృతిచెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవి ఆపాలి,” అని డిమాండ్ చేశారు.

వివేకానంద హత్యపై షర్మిల వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావించిన షర్మిల, “ఈ కేసులో సీబీఐ ఆధారాలతో పాటు సంభాషణలూ ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. అయినా జగన్ వర్గం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అదే మాదిరిగా సింగయ్య హత్యను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది,” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలతో షర్మిల రాజకీయంగా మరోసారి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ఆరోపణలు ఏ విధంగా రాజకీయ ప్రభావం చూపిస్తాయో చూడాల్సిందే.

Read More : ఏపీలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ఫిర్యాదులు:

One thought on “వైఎస్ జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు…

Comments are closed.