వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
సమావేశానికి పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు.
ఈ సమావేశంలో ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకెళ్లడం, కూటమి ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ప్రజా పోరాటానికి కార్యాచరణ రూపొందించడం, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నేతలతో జరగనున్న సమావేశానికి ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు తాడేపల్లికి చేరుకున్నారు.
Read More : ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను NDRF రక్షించింది..
