ప్రసన్న వ్యాఖ్యలపై మంత్రి అనిత తీవ్ర స్పందన

వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలను అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత విమర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల స్వాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. గతంలో తనపై కూడా ప్రసన్నకుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని గుర్తు చేశారు. మహిళలపై దూషణలకు పాల్పడే వ్యక్తులకు పార్టీలో స్థానం ఉండకూడదని డిమాండ్ చేశారు. వెంటనే వైసీపీ పార్టీ ఆయనను సస్పెండ్ చేయాలని, లేకపోతే మహిళలందరి నుండి తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు.

అందరూ కలిసి ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని, మహిళల గౌరవానికి ప్రభుత్వంగా నిలబడి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హామీ ఇచ్చారు.

Read More : ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం

One thought on “ప్రసన్న వ్యాఖ్యలపై మంత్రి అనిత తీవ్ర స్పందన

Comments are closed.