స్క్రిప్ట్ అడిగితే పొగరనుకున్నారు!

Yash

కన్నడ స్టార్ యశ్‌ ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో టాప్ హీరోగా ఎదిగాడు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో అతడి క్రేజ్ దూసుకుపోతుండగా, ఆయనపై నిర్మాతలు వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం యశ్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా, మరోవైపు బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే, యశ్ మార్కెట్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

అయితే, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజులలో యశ్‌ కొంత పొగరుగా ప్రవర్తించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తుచేస్తూ, తాను కెరీర్ ప్రారంభంలో ఎప్పుడూ స్క్రిప్ట్ అడిగేవాడినని యశ్ వెల్లడించాడు.

అప్పట్లో ఇదే త‌నకు ఇబ్బందిగా మారిందని, చాలా మంది దర్శకులు, నిర్మాతలు “స్టార్ అవకముందే ఇంత యాటిట్యూడ్!” అంటూ ఫీలయ్యేవారని చెప్పాడు. కానీ, తన పాత్ర గురించి తెలియకుండానే సినిమా ఒప్పుకోవడం తగదనిపించిందని, అందుకే ప్రతి కథకు స్క్రిప్ట్ అడిగేవాడినని స్పష్టం చేశాడు.

ఇదిలా ఉంటే, యశ్ సినీ ప్రయాణం అంత సులభం కాదు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతను, సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి RTC డ్రైవర్‌ అయినప్పటికీ, తాను మాత్రం నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, కష్టపడుతూ ఎదిగాడు. ‘మొగ్గిన మనసు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యశ్, ఆ సినిమా టీమ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరో మాస్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

Read More

One thought on “స్క్రిప్ట్ అడిగితే పొగరనుకున్నారు!

Comments are closed.