ఆంధ్రప్రదేశ్‌లో నూతన పాలనాపద్ధతుల అమలుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ విధానం ప్రజల్లో మరింత ప్రాచుర్యం పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌కు రంగం సిద్ధం చేసింది.
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల మొబైల్ ఫోన్లలో ‘మన మిత్ర’ పేరిట 9552300009 నెంబరును సేవ్ చేయించనున్నారు. ఈ నంబర్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలు పొందగలుగుతారు.
ఈ డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ లక్ష్యం – ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడం. ప్రస్తుతానికి వాట్సాప్ ద్వారా 250 పైగా సేవలు అందుబాటులో ఉండగా, జూన్ నాటికి ఆ సంఖ్యను 500కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తుదకు ఈ సంఖ్యను 1000కు పెంచాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ పాలనకు ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read More : రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్‌కు నష్టం..

One thought on “ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రత్యేక డ్రైవ్ – ఇంటింటికీ అవగాహన కార్యక్రమం”
Comments are closed.