“చోరీ 2” మూవీ విశ్లేషణ: హర్రర్ మిస్, ఎమోషన్ హిట్!

Chhorii 2 movie review

హర్రర్ థ్రిల్లర్‌గా విడుదలైన “చోరీ 2” ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. 2021లో విడుదలైన “చోరీ” సినిమాకు ఇది సీక్వెల్. విశాల్ ఫ్యూరియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నుష్రత్ భరూచా ప్రధాన పాత్రలో నటించారు. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో, సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

కథ విషయానికొస్తే, సాక్షి అనే టీచర్ (నుష్రత్ భరూచా) తన భర్త హత్య చేసిన విషయాన్ని పోలీసులకు ఒప్పుకుంటుంది. ఆధారాల లేకపోవడంతో ఆమెను వదిలేస్తారు. అనంతరం సాక్షి తన కూతురు ఇషానితో కలిసి సిటీకి వెళ్లి అక్కడ టీచర్‌గా పనిచేస్తుంది. అయితే, ఇషానిని అనుకోని పరిస్థితుల్లో కిడ్నాప్ చేయడం కథను ఆసక్తికర మలుపు తిప్పుతుంది.

కథలో హర్రర్‌తో పాటు సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉండటం సినిమా ప్రత్యేకత. మొదటి భాగం చూడని వారికి కూడా క్లారిటీ వచ్చేలా డైరెక్టర్ కొన్ని సీన్ల ద్వారా సమాచారం అందించారు. మొదటి భాగంలో లాగానే ఈ చిత్రంలోనూ మొదటి భాగం హర్రర్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. రెండో భాగంలో కథ కొంత నెమ్మదిగా అనిపించినా, క్లైమాక్స్ మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంది.

నటుల విషయానికి వస్తే, నుష్రత్ భావోద్వేగ నటనను బాగా ప్రదర్శించారు. చిన్నారి హార్ధిక శర్మ నటన ఆకట్టుకుంది. సోహా అలి ఖాన్ కూడా పాత్రకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా మెరుగ్గా ఉండటంతో పాటు, కొన్ని సీన్లు రిపీటెడ్‌గా అనిపించినా హర్రర్ సినిమాల అభిమానులకు ఈ చిత్రం ఓసారి ప్రయత్నించదగిన అనుభూతినిచ్చేలా ఉంది.

Read More

One thought on ““చోరీ 2” మూవీ విశ్లేషణ: హర్రర్ మిస్, ఎమోషన్ హిట్!

Comments are closed.