తెలంగాణ ప్రభుత్వ జాబ్ ఫెయిర్ ..

వరంగల్‌లో నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్ పెద్ద ఎత్తున నిరుద్యోగులను ఆకర్షించింది. శుక్రవారం ఎంకే నాయుడు కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “తెలంగాణ తెచ్చింది ఉద్యోగాల కోసమే” అని తెలిపారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే వారిని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

తర్వాత మంత్రి సీతక్క మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 60 వేల ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. త్వరలోనే అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇలాంటి జాబ్ మేళాలను నిరుద్యోగులు వినియోగించుకోవాలని, ప్రతి అవకాశాన్ని గౌరవించాలని సూచించారు.

మరోవైపు, మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఈ మెగా జాబ్ మేళాలో 60 కంపెనీల ద్వారా సుమారు 11 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు నిరుద్యోగ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టిందని అన్నారు.

ఈ మెగా జాబ్ మేళా తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగుల పట్ల ఉన్న కట్టుబాటు, బాధ్యతను చాటిచెప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.

Read More : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

One thought on “తెలంగాణ ప్రభుత్వ జాబ్ ఫెయిర్ ..

Comments are closed.