మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై ఆధారంగా సినిమా..?

మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎమోషన్, థ్రిల్, మిస్టరీతో నిండి ఉన్న ఈ ఘటన ఇప్పుడు సినిమా తెరపైకి రానుందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కేసులోని మానసిక ఒత్తిడులు, భావోద్వేగాలు, మిస్టరీ అంశాలు ఆమిర్‌ను ఆకర్షించాయని సమాచారం. కథ ప్రకారం, రాజా రఘువంశీ అనే యువకుడు హనీమూన్‌ సందర్భంగా భార్యతో కలిసి మేఘాలయ వెళ్లి, అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై అతడి భార్య సోనమ్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ మిస్టరీతో కూడిన కథను సినిమాగా మలచాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై ఆమిర్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదుగానీ, ఇది నిజమైతే ప్రేక్షకులకు మరో ఇంటెన్స్ థ్రిల్లర్ కనిపించే అవకాశముంది. గతంలో తలాష్ అనే సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమిర్, ఇప్పుడు మళ్లీ అటువంటి శైలిలో సినిమా తీస్తే ఆసక్తికరమే.

Read More : ‘వార్ 2’ – జూలై ? ట్రైలర్ రిలీజ్

One thought on “మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై ఆధారంగా సినిమా..?

Comments are closed.