యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ (YRF) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను.. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతాను” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది.
యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మళ్లీ కబీర్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కీలక పాత్రలో నటించగా, ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది.
Read More : హరిహర వీరమల్లు సక్సెస్ మీట్‌లో పవన్ భావోద్వేగాలు

One thought on “వార్ 2 ట్రైలర్ విడుదల”
Comments are closed.