టాలీవుడ్ బ్యూటీని చూసి షాక్‌.. ముఖం నిండా గాయాలే!

Ada Sharma viral photos

టాలీవుడ్ నటి అదా శర్మ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖంపై గాయాలున్న ఫొటోలతో ఆమెను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ ఫొటోలు చూసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇవేంటంటే, అదా శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. ముఖం మీద గాయాలతో ఉన్న ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం జరిగినవి కాదని, ఆమె గతంలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా షూటింగ్ సమయంలో తీసినవని తేలింది.

ఆ సినిమా విడుదలై మే 5 నాటికి రెండేళ్లు పూర్తి కావడంతో, అదా తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈ ఫొటోలు షేర్ చేసింది. ఈ మూవీ లో ఆమె పోషించిన పాత్ర కోసం ఎంతో శ్రమపడినట్టు తెలుస్తోంది. గాయాలకూ, కష్టాలకూ మధ్య తాను నటించిన దృశ్యాలు ఇవేనంటూ గుర్తు చేసింది.

‘ది కేరళ స్టోరీ’ సినిమా ఆ సమయంలో విమర్శకుల ప్రశంసలు పొందినంతగా, రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ద్వారా అదా శర్మకు కొత్తగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ వైరల్ ఫొటోలు ఆమె డెడికేషన్‌ను మరోసారి హైలైట్ చేస్తున్నాయి.

Read More



One thought on “టాలీవుడ్ బ్యూటీని చూసి షాక్‌.. ముఖం నిండా గాయాలే!

Comments are closed.