ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ కీలక ప్రకటన చేశారు.

నిర్మాత నాగవంశీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆదివారం hyderbadలో ‘వార్ 2’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులందరూ కలిసి సంబరాలు జరుపుకోనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఈవెంట్ ద్వారా సినిమా ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. హీరో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ఈ వేడుకలో పాల్గొని అభిమానులను అలరించనున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోల కలయిక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : లీగల్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానన్న నటుడు!

One thought on “ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

Comments are closed.