పాన్-ఇండియా మూవీ ‘వార్ 2’ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా జరిగిన ‘వార్ 2’ షూటింగ్లో హృతిక్ రోషన్ గాయపడ్డాడని వార్తలు వస్తున్నాయి. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా సాంగ్ రిహార్సల్స్ సమయంలో గాయపడ్డట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, కనీసం నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
హృతిక్ గాయం కారణంగా ‘వార్ 2’ షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం సినిమా రిలీజ్‌పై ప్రభావం చూపించే అవకాశముంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఆయన పాత్ర సినిమాకు హైలైట్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హృతిక్-ఎన్టీఆర్ మధ్య ఓ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్, సాంగ్ కూడా ఉండనున్నట్లు టాక్.
హృతిక్ గాయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయాలి!

One thought on “‘వార్ 2’ షూటింగ్లో గాయపడిన హృతిక్ రోషన్..?”
Comments are closed.