కావ్యా మారన్‌ – అనిరుధ్ రవిచంద్రన్‌ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ!

Kavya Maran Anirudh Ravichander Dating Rumors

క్రికెట్ అభిమానులకు కావ్యా మారన్ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ సీజన్ వస్తుందంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్‌గా స్టేడియంలో ఆమె ఉత్సాహపూరిత హావభావాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. మ్యాచ్‌ల సమయంలో జట్టు గెలిస్తే ఆనందంతో గంతులు వేస్తూ, ఓడిపోతే నిరాశగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను ఎమోషనల్‌గా చేస్తుంది. అందుకే కావ్యా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

ఇప్పుడు ఈ అందమైన యువతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో కావ్యా మారన్ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అనిరుధ్ వ్యక్తిగత టీమ్ ఈ వార్తలను ఖండించింది. కావ్యా, అనిరుధ్ కేవలం మంచి స్నేహితులని, వారి మధ్య ప్రేమ వ్యవహారం లేదని స్పష్టతనిచ్చారు. గతంలో అనిరుధ్ పేరు హీరోయిన్ కీర్తి సురేష్‌తో కూడా జతకట్టబడింది. అయితే ఇటీవల కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకోవడంతో ఆ వార్తలు కూడా తేలిపోయాయి.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్ సన్ టీవీ, సన్ మ్యూజిక్, సన్ పిక్చర్స్ వంటి విభాగాలకు వారసురాలు. బిజినెస్ ఎమ్పైర్‌కు వారసురాలిగా ఉంటూ, ఐపీఎల్‌లో తన జట్టుకు మద్దతుగా నిలుస్తున్న కావ్యా యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అనిరుధ్ కూడా సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిచాడు. వీరి మధ్య ఉన్న స్నేహం ప్రస్తుతం రూమర్‌గా మారినా, నిజంగా ఏం జరుగుతోందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Read More

One thought on “కావ్యా మారన్‌ – అనిరుధ్ రవిచంద్రన్‌ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ!

Comments are closed.