ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ హిట్‌గా నిలిచిన చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అద్భుతమైన యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఛత్రపతి చిత్రంలో మాతృభక్తి ప్రధానంగా ఉంటూ మాస్ ఎలిమెంట్స్‌కి మేళవింపుగా సాగుతుంది. ఇందులో ప్రభాస్ నటన, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తల్లి కొడుకు సంబంధాన్ని హైలైట్ చేస్తూ ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయి.
ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నటి అనితా చౌదరీ. అంధురాలిగా ఆమె చూపిన నటన ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. తన సహజమైన అభినయంతో ఆమె సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనితా చౌదరీ ప్రముఖ నటుడు శ్రీకాంత్ కు చెల్లెలు. ఈ విషయాన్ని స్వయంగా అనితా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అనితా చౌదరి భర్త, శ్రీకాంత్ కుటుంబానికి సంబంధించి కజిన్స్ అవుతారు. మురారి, సంతోషం, నువ్వే నువ్వే తదితర సినిమాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.

One thought on ““ఛత్రపతి” సినిమాలో నటించిన ఈ నటి.. ఆ స్టార్ హీరోకి చెల్లెలా?”
Comments are closed.