సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫంకీ. ఈ సినిమాను జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది.
ఈమధ్య రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో యూత్ ఆడియన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేసిన కయదు లోహార్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. గతంలో శ్రీ విష్ణుతో కలిసి అల్లూరి సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే డ్రాగన్ విజయం అనంతరం, తెలుగు మేకర్స్ ఆమెపై ఆసక్తి చూపుతున్నారు.
సినిమా కథ గురించి నిర్మాత సితార నాగవంశీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. “ఫంకీ యంగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూతురి లవ్ స్టోరీ. ఇందులో హీరోయిన్ డామినేషన్ ప్రధాన అంశం. కథ అనుకున్నట్టు సాగితే, ఇది మరో గీతా గోవిందం అవుతుంది,” అని తెలిపారు. అంతేకాదు, ఈ కథ నాగ్ అశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని నాగవంశీ చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
విశ్వక్ సేన్ ఈమధ్య చేసిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. ఈసారి అనుదీప్ దర్శకత్వంలో ఫంకీతో భారీ హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుదీప్‌పై ఆడియన్స్‌కు ఉన్న నమ్మకం ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచింది.
అనుదీప్ గత చిత్రం ప్రిన్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. నాగవంశీ కథను బహిరంగంగా చెప్పడంతో ఫంకీపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రం జాతిరత్నాలు తరహాలో వినోదభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. కయదు లోహార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్లీ ప్రత్యేకమైన చిత్రంతో రాబోతోంది.
జాతిరత్నాలు మార్క్ కామెడీ, వినోదంతో ఫంకీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.

One thought on “విశ్వక్ సేన్, అనుదీప్ కెవి కాంబినేషన్‌లో ‘ఫంకీ’ – మరో గీతా గోవిందం అవుతుందా?”
Comments are closed.