టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఒక ట్విస్ట్‌లో చిక్కుకున్నారు, ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. నటి అవనీత్ కౌర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలను విరాట్ కోహ్లీ లైక్ చేశారు, కానీ కొన్ని సమయానికే ఆ లైక్‌ను ఆయన తొలగించారు. ఈ సంఘటనను గుర్తించిన నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్లు తీసి, కోహ్లీ ఫ్యాన్ పేజీల్లో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
ఈ చర్చపై వివరణ ఇచ్చిన విరాట్ కోహ్లీ, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. “నా ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు ఇది పొరపాటున జరిగింది. అల్గారిథమ్ వల్ల ఈ ఇంటరాక్షన్ (లైక్) తప్పుగా నమోదయ్యింది. దీనికి ఎలాంటి ప్రత్యేక ఉద్దేశం లేదు. దయచేసి దీనిపై ఊహాగానాలు చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని కోహ్లీ తన స్టోరీలో పేర్కొన్నారు.

Read More : చెన్నైకు గెలుపు అవసరం లేదు..

One thought on “VK : వివరణ ఇచ్చిన క్రికెటర్”
Comments are closed.