దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీస్

ప్రజా సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలోనే ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో తన ఇంటి సమస్య పరిష్కారం కోసం వచ్చిన ఓ దివ్యాంగుడిని పోలీస్ అత్యుత్సాహం ప్రదర్శించి అమానుషంగా ఈడ్చుకెళ్లాడు.

వివరాలు:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజ గంగారాం కలెక్టరేట్‌లోని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. ఈ సమయంలో కలెక్టర్ వస్తున్నారని చెప్పిన ఒక పోలీస్ కానిస్టేబుల్, దివ్యాంగుడిని నేల మీదుగా ఈడ్చుకెళ్లడం ఆందోళన కలిగించింది.

ఈ ఘటనను కలెక్టర్ సత్యప్రసాద్ చూసీచూడనట్టు వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావాణిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : తెలంగాణ ఆర్థిక సంక్షోభం: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు