కరీంనగర్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కార్యదర్శి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు లంచం కేసులో ఏసీబీకి చిక్కాడు. కొత్తగా నిర్మించిన ఇంటికి నెంబర్ కేటాయించడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

గ్రామస్తులు ఆయన ఎప్పటికప్పుడు లంచాలతో వేధించేవాడని ఆరోపించారు. ఈ ఘటనతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్థులు పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

Read More : వినాయక చవితి వేడుకల్లో ఆకతాయిలపై షీ టీమ్స్ కఠిన నిఘా.