ఫ్యాన్‌పై తుపాకీతో బెదిరింపు..? విజయ్ బాడీగార్డ్ వ్యవహారం వివాదంగా మారింది

Vijay Thalapathy bodyguard fan incident

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయనపై అభిమానుల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల మధురై విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. తన సినిమా షూటింగ్‌ కోసం మధురైకి వచ్చిన విజయ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

అయితే ఈ సందర్భంగా ఓ వృద్ధ అభిమాని విజయ్‌ను కలవడానికి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అతడిని ఆపడానికి విజయ్ బాడీగార్డ్ గన్‌ను అతడి ముఖానికి చూపిస్తూ వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.

కొంతమంది విజయ్ బాడీగార్డ్ ప్రవర్తనను ఖండిస్తూ.. అభిమానులతో ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమేనని సమర్థిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’ షూటింగ్ కోడెకనల్‌లో జరగగా, అనంతరం మధురై నుంచి చెన్నైకి వెళ్లిన ఆయనకు ఈ తరహా పరిస్థితి ఎదురైంది. ఒక అభిమాని ప్రయత్నం ఇంత వివాదానికి దారి తీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Read More

One thought on “ఫ్యాన్‌పై తుపాకీతో బెదిరింపు..? విజయ్ బాడీగార్డ్ వ్యవహారం వివాదంగా మారింది

Comments are closed.