ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సమస్యను ఎదుర్కొన్న వారు తమ పీడకర అనుభవాలను బయటపెట్టేందుకు చాలా ధైర్యం కనబరిచారు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
విద్యాబాలన్, “ఓ సినీ నిర్మాత నా దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి మాటలు నాకు చాలా బాధను కలిగించాయి. ఆ అవమానం కారణంగా నేను ఆరు నెలల పాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు” అని వెల్లడించింది. తనపై జరిగిన అవమానంతో ఆమె నరకం అనుభవించినట్లు పేర్కొంది.
విద్యాబాలన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న మరిన్ని చేదు అనుభవాలను కూడా పంచుకుంది. “ఆ సమయంలో నాకు బాడీ షేమింగ్ కూడా జరిగింది. అలాగే, ఒక మలయాళ సినిమాలో ఆఫర్ వచ్చినా, ఆ సినిమా ఆగిపోవడం వల్ల నాకు దురదృష్టవంతురాలన్న చర్చలు నడిచాయి” అని ఆమె పేర్కొంది.
విద్యాబాలన్, ‘డర్టీ పిచ్చర్’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత, బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆమె, ఈ సందర్బంగా తనకు ఎదురైన అనుభవాలను షాక్ ఇస్తూ మాట్లాడింది.

One thought on “కాస్టింగ్ కౌచ్ బాధతో 6 నెలలు నరకం అనుభవించిన విద్యాబాలన్!”
Comments are closed.