టీడీపీ నేతలపై మాజీ మంత్రి విదదల రాజిని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న టీడీపీ నాయకులు గతంలో ఏం చేశారు?” అని నిలదీశారు. చంద్రబాబు షూటింగ్ కోసం పుష్కరాల సమయంలో 29 మంది మృతి చెందిన ఘటనను గుర్తు చేశారు.
“రా కదలిరా అంటూ ఇరుకు గల్లీల్లో ప్రోగ్రాం పెట్టి కనిగిరిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చీరలు పంచుతున్నాం అంటూ గుంటూరులో ముగ్గురు మృతి చెందారు. అప్పట్లో టీడీపీ నాయకులు ఎందుకు స్పందించలేదు?” అని రాజిని ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకోవడం అమానుషమని ఆమె విమర్శించారు. అప్పట్లో జరిగిన ప్రమాదాలపై మౌనం వహించిన టీడీపీ నాయకులు ఇప్పుడు నైతిక హక్కుతో మాట్లాడే పరిస్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : చిత్తూరులో మహిళపై దాడిపై NHRC స్పందన
