వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్, తాజాగా తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించేందుకు కొత్త ప్రయోగం చేపట్టాడు. విభిన్న కథలతో ప్రత్యేకతను చూపించిన ఆయన, గద్దలకొండ గణేష్ తర్వాత మళ్ళీ సరైన హిట్ అందుకోలేక పోయాడు.
గని, ఎఫ్3, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వరుణ్ తన కెరీర్‌పై మళ్లీ ఆలోచించాల్సి వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్‌తో చేసిన ఆపరేషన్ వాలెంటైన్ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది. కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
తన తోటి హీరోలు ఘనవిజయాలు సాధిస్తుండగా, వరుణ్ తేజ్ మాత్రం ఇంకా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అయినా వరుణ్‌కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

One thought on “కొరియన్ హారర్ కామెడీపై వరుణ్ తేజ్ భారీ ఆశలు”
Comments are closed.