మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కేసు విషయంలో పోలీసులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌పై బెదిరింపు కేసుకు సంబంధించి వంశీని మరో 10 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో (Vijayawada SC, ST Court) ఈరోజు (బుధవారం) పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే వంశీ మూడు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ విచారణకు సహకరించలేదని, అనేక ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, ఆధారాలతో కూడిన ప్రశ్నలు ఎదురుపెట్టినా వంశీ స్పందించలేదని తెలిపారు. మరో 10 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని కోర్టును పోలీసులు కోరారు.
ఈ కేసు విచారణలో తదుపరి చర్యలపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

One thought on “వల్లభనేని వంశీ కేసు: మరోసారి కస్టడీకి పోలీసుల పిటిషన్”
Comments are closed.