గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీని నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారించేందుకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో అర్హులు కాని వారికి నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసుకు సంబంధించి, వంశీపై ఇప్పటికే కేసు నమోదు కాగా, తాజా దశలో ఆయనను విజయవాడ సబ్ జైలు నుండి కస్టడీకి తీసుకొని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ కేసులో లోతైన విచారణ చేపట్టాలని భావించిన పోలీసులు, వంశీని రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించగా, న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో పోలీసులు ఆయన్ని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.
బాపులపాడు గ్రామంలో జరిగిన ఈ నకిలీ పట్టాల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. అర్హులైన పేదలకూ కాకుండా, ఇతరులకు పట్టాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై వంశీపై పీటీ వారెంట్ జారీ అయింది. గతంలోనే ఈ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందు హాజరుపరచగా, రిమాండ్ విధిస్తూ జైలుకు తరలించారు.
ఇప్పటికే వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంతో, తాజా విచారణలో కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు రోజుల కస్టడీ దశ ఈ కేసు దర్యాప్తులో మలుపు తిప్పే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
Read More : AP రూఫ్‌టాప్ సోలార్ పథకం

One thought on “నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ”
Comments are closed.