ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కీలక అడుగులు

ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కీలక చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, ఆయన నేడు న్యూఢిల్లీకి వెళ్లి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేకించి రక్షణ రంగంలో ఏపీకి ప్రముఖ స్థానాన్ని కల్పించే దిశగా రూపొందించిన సమగ్ర ప్రణాళికపై విస్తృత చర్చ జరిగింది.

సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు, రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రం కీలక పాత్ర పోషించనున్నదని తెలిపారు. రాష్ట్రంలో థీమాటిక్ డిఫెన్స్ హబ్‌ల ఏర్పాటు, డీఆర్‌డీఓ అనుబంధ ఉత్కృష్టతా కేంద్రాల స్థాపనపై ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించినట్లు వెల్లడించారు.

అలాగే వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి, విధానపరమైన ఆవిష్కరణలతో ఏపీని రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

ఈ సమావేశం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి బలం చేకూరుతుందని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More : నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ

One thought on “ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కీలక అడుగులు

Comments are closed.