వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

vamsi vallabhaneni

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ కిడ్నాప్, బెదిరింపు ఆరోపణల నేపథ్యంలో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన తరఫున బెయిల్ పిటిషన్‌ దాఖలైంది.

విచారణ 26వ తేదీకి వాయిదా

వంశీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అనారోగ్య కారణాలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికే నెలరోజులుగా రిమాండ్‌లో ఉండటంతో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే ప్రాసిక్యూషన్‌ వాదనల్లో, వంశీపై అనేక ఆధారాలు ఉన్నాయని, బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉండడంతో బెయిల్‌ను తిరస్కరించాలని వాదించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వంశీకి బెయిల్ మంజూరవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

ఇదిలా ఉండగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ కస్టడీకి వంశీని అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ అధికారులు పది రోజుల పాటు కస్టడీ కోరగా, విచారణ అనంతరం కోర్టు మూడు రోజుల కస్టడీ మంజూరు చేసింది.

Read More

One thought on “వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Comments are closed.