బెంగళూరులో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని, 700 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత, కేరళలోని ఒక మారుమూల గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ వద్ద జరిగింది, అక్కడ ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను వెంబడిస్తూ, ఒక మహిళపై దాడి చేసి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.
నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అతన్ని బెంగళూరు నుంచి హోసూర్, సేలం, అనంతరం కోజికోడ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. చివరికి మూడు రాష్ట్రాల్లోని 700 సీసీటీవీ కెమెరాలు పరిశీలించి, కేరళలో నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Bengaluru women walk with caution!
— Nabila Jamal (@nabilajamal_) April 7, 2025
BTM Layout | April 3 | 1 :52 AM
Man caught on CCTV following two women before suddenly groping one of them and fleeing. The women visibly shaken, did not file a complaint, likely out of fear#Bengaluru police say they've filed a suo motu… pic.twitter.com/hTqwylooEH
కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఈ ఘటనపై రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి. “ఇంత పెద్ద నగరంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండే విషయమే” అని ఆయన వ్యాఖ్యానించడంతో, బీజేపీ తీవ్ర ప్రతిఘటనను తెలిపింది. మహిళలపై నేరాలను సాధారణీకరించడం ఖండించనని, ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా, మహిళలపై లైంగిక దాడుల రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కృషి వల్ల నిందితుడు శీఘ్రంగా పట్టుబడినప్పటికీ, ఈ దాడి సామాజిక దృష్టిలో మరిన్ని ప్రశ్నల్ని ఎదరుస్తోంది.
