అమెరికా-చైనా మధ్య ఆర్థిక ఆధిపత్యం కోసం పోరు ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కౌంటర్ చర్యలకు దిగారు. అమెరికా నుండి వచ్చే ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వాణిజ్యంలో పెద్దగా కలవరం రేగుతోంది. దిగుమతులు-ఎగుమతులపై పెరిగిన టారిఫ్‌లు, రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపై ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read More : అమెరికాలో 17 ఏళ్ల యువతికి వేపింగ్ వల్ల ‘పాప్‌కార్న్ లంగ్’

One thought on “అమెరికా-చైనా మధ్య ఆర్థిక యుద్ధం ముదురుతోంది”
Comments are closed.