తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యాల కోసం, తిరుమల అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే:
- టీటీడీ కార్యాలయాలను ఒకే సముదాయంలో ఏర్పాటు చేసేందుకు “అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్” నిర్మించేందుకు నిర్ణయం.
- తిరుమలలో భక్తుల పెరుగుతున్న రద్దీ దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 3 నిర్మాణానికి సిద్ధమవుతోంది టీటీడీ. ఇందుకు feasibility study కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
- అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు.
- టీటీడీలో పనిచేస్తున్న 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ఫైలు ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నారు.
- ఒంటిమిట్ట రామాలయంలో అన్నప్రసాదాల కోసం రూ.4.35 కోట్లు మంజూరు.
- కొత్తగా 700 వేదపారాయణదారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న టీటీడీ.
- ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో భజన మండిరాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధుల విడుదల.
- రాష్ట్రవ్యాప్తంగా 320 ఆలయాలకు ఉచితంగా మైక్ సౌకర్యం అందించనున్నారు.
- దేవాదాయ శాఖ సిఫారసుతో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున 600 మందికి భృతిని టీటీడీ మంజూరు చేసింది.
- భక్తులు వేచి ఉండేందుకు తిరుమలలో అవసరమైన నిర్మాణాలకు కన్సల్టెన్సీ నియామకం.
- శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి ప్రత్యేక కన్సల్టెన్సీ ఏర్పాటు.
ఈ నిర్ణయాలన్నీ భక్తుల అనుభవాన్ని మెరుగుపర్చే దిశగా మరియు తిరుమల అభివృద్ధికి దోహదపడే విధంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు.
Read More : క్వార్ట్జ్ స్కాం విచారణలో వైసీపీ నేతల కీలక పాత్ర బహిర్గతం

One thought on “టీటీడీ సమావేశం – పలు అభివృద్ధి నిర్ణయాలు”
Comments are closed.