తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మరో చిన్న సినిమాకు అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండానే కంటెంట్ బలంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే తమిళ చిత్రం, ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రానికి శశికుమార్ హీరోగా, సిమ్రాన్ హీరోయిన్‌గా నటించగా, అభిషన్ జీవీనాథ్ దర్శకత్వం వహించారు.
శ్రీలంక జాఫ్నాలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుటుంబంతో చెన్నైకి చేరుకున్న తర్వాత ఎదురైన సంఘటనల్ని హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడిన కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న ఇండియాలో, మే 1న వరల్డ్‌వైడ్ విడుదలైంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పటికి రూ.17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
తమిళనాట ఈ చిత్రం రూ.12 కోట్లు వసూలు చేయగా, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం వర్డ్ ఆఫ్ మౌత్‌తో హిట్ అయింది. శశికుమార్, సిమ్రాన్ వంటి నటుల పాత్రలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. మినిమమ్ బడ్జెట్ సినిమాలకు ఇది మరో ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోంది.
ఇక ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం ఇప్పటికే పలువురు బయ్యర్లు పోటీపడుతున్నట్టు సమాచారం. శశికుమార్, సిమ్రాన్ తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితులు కావడం వల్ల ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలనే ఉత్సాహం కనిపిస్తోంది. అయితే మేకర్స్ మాత్రం హక్కుల రేటు విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
One thought on “తమిళ హిట్ మూవీకి తెలుగు రైట్స్ కోసం పోటీ!”
Comments are closed.