హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక.. ఇప్పుడు నిర్మాతగా సక్సెస్!

హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక.. ఇప్పుడు నిర్మాతగా సక్సెస్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. గ్లామర్, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా, ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌గా పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారింది. ఇక ఇప్పుడు నిర్మాతగా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

సినీరంగంలో కథానాయికగా స్టార్ స్టేటస్ సంపాదించాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు, అదృష్టం కూడా కీలకం. తొలి సినిమా మంచి పేరు తెచ్చినా, కెరీర్ గాడిలో పడాలంటే సరైన హిట్స్ అవసరం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ నటి కూడా అదే కోవకు చెందినది. మొదటి చిత్రంలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా కొనసాగింది. కానీ టాలీవుడ్‌లో మొత్తం 25 సినిమాలు చేసినా, అందులో కేవలం 5 మాత్రమే విజయం సాధించాయి. గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ఆకట్టుకుంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమైన హీరోయిన్ ఛార్మీ. పౌర్ణమి, మాస్, లక్ష్మీ, మంత్ర, జ్యోతిలక్ష్మీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కథానాయికగా కెరీర్ మంచి దశలో ఉండగానే నటనకు గుడ్‌బై చెప్పేసింది.

ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి దాదాపు 8 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అందులో జ్యోతిలక్ష్మీ, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే పెద్ద హిట్స్‌గా నిలిచాయి.

ఓవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న ఛార్మీ, మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పూరి కనెక్ట్స్‌కు సంబంధించిన వీడియోలు, సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఎంగేజ్ చేస్తుంది.

Read More

One thought on “హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక.. ఇప్పుడు నిర్మాతగా సక్సెస్!

Comments are closed.