వేతనాల పెంపుపై సినీ కార్మికుల బంద్

వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన బంద్ మూడో రోజు కూడా కొనసాగుతోంది. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల ఫెడరేషన్ సంఘం నేడు మెగాస్టార్ చిరంజీవిని కలవనుంది.

ఇప్పటికే సినీ నిర్మాతలు చిరంజీవిని కలిసి తమ వాదనను వినిపించారు. కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని నిర్మాతలు స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజువారీ సగటున రూ. 2,000 చెల్లిస్తున్నామని, దాదాపు 70 శాతం మంది కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నామని నిర్మాతలు తెలిపారు. బంద్ కోరుకుంటున్నది నిజంగా కష్టపడే కార్మికులు కాదని, సమయం వృథా చేసే వారే అని నిర్మాతలు మండిపడ్డారు. ఈ వివాదంపై చిరంజీవి ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : రాజకీయాలపై చిరంజీవి వ్యాఖ్యలు