రాజకీయాలపై చిరంజీవి వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కొందరు తనను విమర్శిస్తూనే ఉంటారని అన్నారు. కొందరు అభిమానులు తాను ఎందుకు ఆ విమర్శలకు స్పందించడం లేదని అడిగినప్పుడు, తాను చేసిన మంచి పనులే వారికి సమాధానం చెబుతాయని చెప్పానని చిరంజీవి వివరించారు.

రక్తదానంపై చిరంజీవి

రక్తదానం గురించి ఆలోచన వచ్చినప్పుడు తన పేరు గుర్తుకు రావడం తాను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యమని చిరంజీవి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడైనా రక్తం అవసరమైనప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి అని హీరో తేజ సజ్జా ప్రశంసించారు.

చిరంజీవి అభిమానుల రక్తదాన కార్యక్రమాలపై తేజ సజ్జా ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More : విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు

One thought on “రాజకీయాలపై చిరంజీవి వ్యాఖ్యలు

Comments are closed.