తిరుపతిలో యూనియన్ బ్యాంకు ఉద్యోగి భారీ మోసం – 2.5 కోట్ల బ్యాంకు డబ్బుతో ఆన్లైన్ కాసినోలో బెట్టింగ్!
తిరుపతి జిల్లాలోని నాగలాపురం యూనియన్ బ్యాంకులో సంచలన ఘటన వెలుగుచూసింది. బ్యాంకులో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ బ్యాంకుకు చెందిన భారీ మొత్తాన్ని దుర్వినియోగం చేసిన ఘటన కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు సుమారు 5 కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.2.5 కోట్ల బ్యాంకు డబ్బును అవకతవకలకు ఉపయోగించాడు. ఈ మొత్తాన్ని ఆయన ఆన్లైన్ కాసినోలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు.
రోజుకు రూ.5 లక్షలు పెట్టి 50 రోజుల్లో 2.5 కోట్లు వెచ్చించాడు!
ఈ మోసం ఒంటరిగా జరగలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. బ్యాంకులో భారీ స్కామ్ జరగడం, నిందితుడు ఆ మొత్తాన్ని బెట్టింగ్‌కు ఉపయోగించడం పట్ల అధికారులూ, ప్రజలూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతా నిబంధనలపై ఇప్పుడు మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
