తిరుపతి జిల్లా నరసింగాపురంలో మైనర్ బాలిక మృతి: హత్యా? ఆత్మహత్యా?

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందిన విషాదకర ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. మిట్టపాలెంకు చెందిన అజయ్‌ను ప్రేమించిన బాలిక, దాదాపు ఆరు నెలల క్రితం గర్భవతి కావడంతో, ఆమె తల్లిదండ్రులు గర్భస్రావం చేయించారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో అజయ్‌పై పాస్కో చట్టం కింద కేసు నమోదు కాగా, అతడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

జైల్లో ఉన్న అజయ్‌ను పలుమార్లు కలిసిన బాలిక, గత శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. మరణానికి కొద్ది గంటల వ్యవధిలోనే బాలికకు అంత్యక్రియలు నిర్వహించడంతో అనేక అనుమానాలు ఉత్పన్నమయ్యాయి.

ఈ మృతి హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు కేసును పరిగణనలోకి తీసుకొని సున్నితంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతికి గల కారణాలు, ఇంత తొందరగా అంత్యక్రియలు జరపడం వెనుక ఉన్న నేపథ్యంలో వాస్తవాలు వెలికితీయేందుకు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

Read More : ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను NDRF రక్షించింది..

One thought on “తిరుపతి జిల్లా నరసింగాపురంలో మైనర్ బాలిక మృతి: హత్యా? ఆత్మహత్యా?

Comments are closed.