తిరుమల – కర్ణాటక భక్తులు గాయాలు

తిరుమల ఘాట్ రోడ్‌పై 35వ మలుపు వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న సుమో వాహనం అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కకు వాలిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఏడుగురు కర్ణాటక భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

వాహనం ఎలా అదుపు తప్పిందన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రమాద ఘటనతో తిరుమల ఘాట్ రోడ్‌పై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తర్వాత పోలీసులు మార్గాన్ని క్లియర్ చేశారు.

Read More : ప్రత్యేక పూజల పేరిట మోసం..