ప్రత్యేక పూజల పేరిట మోసం..

ప్రత్యేక పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసి రూ.10 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలపై ఒక అఘోరీను చేవెళ్ల కోర్టు 14 రోజుల న్యాయహిరాసతకు పంపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ పొందారు.

మోసానికి గురైన మహిళ ఫిర్యాదు

వివరాల్లోకి వెళితే, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మీయంగా దగ్గరయ్యిన అఘోరీ సూచనతో ప్రత్యేక పూజలు చేయించాలనే ఉద్దేశంతో అతని వద్దకు వెళ్లింది. అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మబలికిన అఘోరీ, దశలవారీగా రూ.10 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే, ఎక్కువ కాలం గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదు. ఆపై అఘోరీ ప్రవర్తనపై అనుమానంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది.

అఘోరీ అరెస్ట్ – కోర్టులో హాజరు

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అఘోరీని అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి ప్రాథమిక ఆధారాలను పరిశీలించి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతన్ని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.

అఘోరీ స్పందన

తనపై వచ్చిన ఆరోపణలు కోర్టులో విచారణలో ఉన్నాయని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని అఘోరీ వెల్లడించారు.

మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అరెస్ట్ – వర్షిణి కౌన్సిలింగ్

ఇదిలా ఉండగా, ఇటీవల అఘోరీ వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరినీ మధ్యప్రదేశ్ – యూపీ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అఘోరీను నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, వర్షిణిని కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపినట్టు సమాచారం.

Read More : కొడుకుని హత్య చేసిన తండ్రి