తిరుమల హోటళ్ల ధరలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు

తిరుమలలోని హోటళ్ల ధరలు తగ్గాయని సోషల్ మీడియాలో విస్తరిస్తున్న సందేశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజులు పూర్తిగా అసత్యమని, భక్తులు వాటిని నమ్మరాదని టీటీడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం తిరుమలలో అమల్లో ఉన్న హోటల్ ధరలు, రూమ్ చార్జీలు ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సమాచారం పూర్తిగా తప్పుగా ఉందని పేర్కొన్నారు. ఈ రకమైన అసత్య ప్రచారాలు భక్తుల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని, దీన్ని పరిశీలించిన అధికారులు ఇటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్‌ ద్వారా మాత్రమే తాజా సమాచారం తెలుసుకోవాలని, అపోహలకు లోనుకాకండని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Read More : హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

One thought on “తిరుమల హోటళ్ల ధరలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు

Comments are closed.