తిరుమల గోవింద నిలయంలో భక్తులకు ఎదురైన అవస్థలు!

గోవింద నిలయం అతిథి గృహంలో లిఫ్ట్‌లో తలపడ్డ ప్రమాదం భక్తుల్లో ఆగ్రహం రేపుతోంది. చిన్నపిల్లలు, మహిళలతో కూడిన భక్తులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి సుమారు అరగంటపాటు కష్టాలు అనుభవించారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్నా సిబ్బంది పట్టించుకోకుండా, “కరెంట్ రాకపోతే ఏం చేయలేము” అంటూ చేతులెత్తేయడం భక్తులను మరింత ఆందోళనకు గురిచేసింది.

ఈ ఘటనపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు.

Read More : టీడీపీ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం