పదో తరగతి : – 81.14% పాస్ , అమ్మాయిలదే పైచేయి..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ మంగళవారం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పదో తరగతి ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేశారు.

ఈ ఏడాది మొత్తం 81.14 శాతం మంది విద్యార్థులు పాస్ సాధించారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,680 స్కూళ్లలో వంద శాతం పాస్ నమోదు కాగా, మరోవైపు 19 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ సాధించకపోవడం గమనార్హం.

జిల్లాల వారీగా చూస్తే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల కృషిని ఆయన ప్రశంసిస్తూ, మరింత మెరుగైన భవిష్యత్తు కోసం అభినందనలు తెలిపారు.

Read More : తిరుమల గోవింద నిలయంలో భక్తులకు ఎదురైన అవస్థలు!

One thought on “పదో తరగతి : – 81.14% పాస్ , అమ్మాయిలదే పైచేయి..

Comments are closed.