తిరుమలలో వందల ఆవులు మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) స్పష్టత ఇచ్చింది. గోశాలలో భారీ సంఖ్యలో ఆవులు చనిపోయాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని టీటీడీ స్పష్టం చేసింది.

సమాజ మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న మృతి చెందిన గోవుల చిత్రాలు తిరుమల గోశాలకు సంబంధించినవి కాదని టీటీడీ అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. తిరుమలలోని గోశాలలో ఉన్న ఆవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వాటిని వైద్య నిపుణుల పర్యవేక్షణలో తగిన విధంగా సంరక్షిస్తున్నామని తెలిపారు.
ఇలాంటి అసత్య ప్రచారాలు భక్తులను తప్పుదారి పట్టించే అవకాశముందని, వాటిని వ్యాప్తి చేయకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల గోశాల గురించి తప్పుడు వార్తలు సృష్టించడం బాధాకరమని పేర్కొంది. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను కఠినంగా ఖండిస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.
Read More : తిరుమల గోశాలలో ఆవుల దుస్థితిపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

One thought on “తిరుమల గోశాలలో ఆవుల మృతి వార్తలు అసత్యం: టీటీడీ స్పష్టత”
Comments are closed.