మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంజలా ఝవేరి, సౌందర్య కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో చిరంజీవి, అంజలా ఝవేరి మధ్య వచ్చే రైల్వే స్టేషన్ లవ్ సీన్ ఇప్పటికీ స్పెషల్‌గా గుర్తుంటుంది. డైలాగులు లేకుండా హావభావాలతో తెరకెక్కిన ఈ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూలో ఈ సీన్ వెనుకున్న ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు.
దాదాపు పదినిమిషాల పాటు ఉండే ఈ సీన్‌ను డైలాగ్ లేకుండా చిత్రీకరించడం పెద్ద సవాల్‌గా నిలిచిందని గుణశేఖర్ తెలిపారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో షూటింగ్ చేయాలన్న ఆలోచనకు నిర్మాత అశ్వినీదత్ మొదట నొచ్చుకున్నారని, ప్రయాణికుల ఇబ్బందులే కాకుండా, రైల్వేశాఖ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనే భయం కూడా ఉండేదన్నారు.
చివరికి ఎన్నో కష్టాల తర్వాత పర్మిషన్ రావడంతో షూటింగ్ చేపట్టారు. చిరంజీవి షూటింగ్ కోసం స్టేషన్‌కి వచ్చిన ప్రజలు ట్రైన్ ఎక్కకుండా అక్కడే ఉండిపోయారట. ఆ సీన్ తీయడానికి ఎంత కష్టపడ్డామో ఇప్పటికీ గుర్తొస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు గుణశేఖర్.

One thought on “డైలాగ్ లేకుండా పదినిమిషాల సీన్..? చిరంజీవి కోసం గుణశేఖర్ చేసిన రిస్క్!”
Comments are closed.