యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, తన తొలి చిత్రం ‘దసరా’తో పాన్ ఇండియా హిట్ అందించి, నాని వంటి నేచురల్ స్టార్‌ను వంద కోట్ల క్లబ్‌లో చేర్చాడు. ఇప్పుడు అదే జోష్‌తో ‘ద ప్యారడైజ్’ అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ‘రా ట్రూత్ రా ల్యాంగ్వేజ్’ గ్లింప్స్‌కి వినియోగించిన రా కంటెంట్ ప్రేక్షకులను, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. లేడీ వాయిస్‌తో నాని పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ‘దసరా’ సినిమాకు గ్లింప్స్ విడుదల చేసి, అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్, అదే ఫార్ములాను ‘ద ప్యారడైజ్’ కోసం కూడా ఫాలో అవుతున్నాడు. ఈ గ్లింప్స్ సీజీ కోసం నిర్మాత చెరుకూరి సుధాకర్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రీ-ప్రొడక్షన్ దశలోనే గ్లింప్స్ కోసం ఈ స్థాయి ఖర్చు చేయడం సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
గ్లింప్స్‌కే కోటి ఖర్చు చేస్తే, ‘ద ప్యారడైజ్’ సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే చర్చ మొదలైంది. ‘దసరా’తో భారీ విజయం అందుకున్న శ్రీకాంత్ ఓదెలపై నాని, నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం, ఈ సినిమా బడ్జెట్‌తో స్పష్టమవుతోంది. మ్యాక్సిమమ్ మ్యాడ్నెస్‌తో రూపొందుతున్న ఈ సినిమా, నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

One thought on “ద ప్యారడైజ్ గ్లింప్స్‌కి కోటి ఖర్చు.. సినిమా బడ్జెట్ ఎంత?”
Comments are closed.