ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌పై, నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తమ్ముడు’, జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లయ సినీ రీ ఎంట్రీ ఇవ్వడం, నితిన్ కోసం సరైన హిట్ అవసరం ఉండటంతో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.
కథ విషయానికి వస్తే:
నితిన్ పాత్రలో జై అనే ఆర్చరీ క్రీడాకారుడు కనిపిస్తాడు. దేశానికి బంగారు పతకం అందించాలనే పట్టుదల అతనికి ఉంది. కానీ గతానికి సంబంధించిన బాధలు, ముఖ్యంగా చిన్ననాటి ఘటనలు అతని ఏకాగ్రతను దెబ్బతీయడమే కాకుండా, మానసికంగా కూడా ప్రభావం చూపుతుంటాయి. చిన్నప్పుడు వదిలేసిన అక్క స్నేహలత (లయ)ను కలవాలని, ఆమె నుంచి ‘తమ్ముడా’ అన్న మాట వినాలని కోరుకుంటాడు. తన ఫ్రెండ్ చిత్ర (వర్ష బొల్లమ్మ)ను వెంటబెట్టుకుని ఆమెను వెతకడానికి బయలుదేరుతాడు.
ఇక తర్వాత కథ అడవుల్లో సాగుతుంది.
తన అక్క పేరు ఇప్పుడు ‘ఝాన్సీ’గా మారిందని, ఆమె అంబరగొడుగు అనే ప్రాంతంలో ఉన్న జాతరకు వెళ్లిందని తెలుసుకుని, జై అక్కడకు చేరుకుంటాడు. కానీ అక్కడి పరిస్థితులు ఊహించినట్లుండవు. ఆమె కుటుంబం శత్రువుల ముప్పులో ఉన్నట్లు తెలుస్తుంది. వాటినుంచి ఆమెను, ఆమె కుటుంబాన్ని రక్షించేందుకు జై చేసే ప్రయత్నమే మిగతా కథ.
ప్లస్ పాయింట్లు:
- ఫారెస్ట్ లొకేషన్స్‌ను గొప్పగా చూపించిన కెమెరా పనితనం
- అజనీష్ లోక్‌నాథ్ సంగీతం
- శ్వాసిక పాత్ర డిజైన్, నటన ఆకట్టుకుంటాయి
- లయ పాత్ర హుందాగా రూపుదిద్దుకుంది
మైనస్ పాయింట్లు:
- కథలో కొత్తదనం లేకపోవడం
- ఎమోషన్ల కంటే యాక్షన్‌కే అధిక ప్రాధాన్యం
- సప్తమి గౌడ పాత్ర మరియు ట్రాక్ అసహజంగా అనిపించడం
- హీరో, విలన్, హీరోయిన్ మధ్య సబంధం లేకపోవడం కథలో బలహీనతగా మారింది
ముగింపు:
‘తమ్ముడు’ సినిమా విజువల్‌గా, టెక్నికల్‌గా మెప్పించినా, కథాపరంగా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ ఫార్మాట్‌కి భిన్నంగా ఏమీ చేయలేకపోయిన కథ, కొన్ని పాత్రలు బలహీనంగా డిజైన్ చేయడం సినిమా బలహీనతగా మారింది.
Review By: NewsTap

One thought on “నితిన్ ‘తమ్ముడు’ రివ్యూ: అడవిలో యాక్షన్..?”
Comments are closed.