భారతదేశంలో టెస్లా తొలి షోరూమ్‌కు ముంబై వేదిక కానుంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, జూలై 15న మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన తొలి షోరూమ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించబోతోంది. అమెరికాకు చెందిన ఈ దిగ్గజ సంస్థ ఇండియాలో అడుగుపెడతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా వాటికి తెరదించుతూ, భారత మార్కెట్‌లో అధికారికంగా ప్రారంభించేందుకు ముంబైని ఎంచుకుంది. ఈ షోరూమ్ ద్వారా టెస్లా వాహనాల ప్రదర్శనతో పాటు విక్రయాలను కూడా చేపట్టనుంది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో ఈ షోరూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ షోరూమ్ పనులు పూర్తికాగా, ప్రత్యేక ఆహ్వానాలతో గ్రాండ్ ఓపెనింగ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇండియాలో టెస్లా ప్రవేశం ఎలక్ట్రిక్ వాహన రంగానికి కొత్త ఊపు నిచ్చే అవకాశముంది. అలాగే భారత వినియోగదారులకు అధునాతన టెక్నాలజీతో కూడిన EV కార్లను అందించేందుకు ఇది ముఖ్యమైన ముందడుగు.
Read More : బిగ్‌బాస్ హౌస్‌లో ఆత్మహత్యాయత్నం
