తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్ర సమయంలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్ (32) అనే భక్తుడు హత్యకు గురయ్యాడు. విద్యాసాగర్ గిరి ప్రదక్షిణ కోసం తిరువణ్ణామలై వెళ్లిన సమయంలో అతడి వద్ద ఉన్న రూ.500 కాజేసేందుకు ఇద్దరు తమిళ వ్యక్తులు ప్రయత్నించారు. ఈ దురాలోచనలో భాగంగా, వారు విద్యాసాగర్‌ను గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను తోటి భక్తులు ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి, నిందితులుగా ఉన్న గుగనేశ్వరన్ (22), తమిళరసన్ (25) అనే ఇద్దరిని అరెస్టు చేశారు.
ఈ ఘటనతో తెలుగు భక్తుల మధ్య ఆందోళన వ్యక్తమవుతోంది. అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలుగు భక్తులపై వివక్ష చూపుతున్నారని, భద్రత లోపించిందని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులు మరింత దర్యాప్తు జరుపుతున్నారు.
Read More : అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
