తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి? బండి సంజయ్ ప్రశ్నలు

Bandi sanjay

మహిళలను గౌరవిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. రాష్ట్రపతి పదవి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వరకు మహిళలకు అధికారం కల్పించిన పార్టీ తమదేనని ఆయన స్పష్టం చేశారు.

శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. “మహిళా శక్తి అంటే కేవలం మాటలు, పెద్ద పెద్ద ప్రకటనలకే పరిమితమా?” అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మహిళలకు హామీగా ఇచ్చిన రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, స్కూటీ పథకాలు ఎక్కడ? బెల్ట్ షాపుల తొలగింపు మాట ఏమైంది?” అని నిలదీశారు.

తెలంగాణ మహిళలు రాణి రుద్రమదేవి వారసులు అంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. “మహిళలను మభ్యపెట్టే పాలకులకు కర్రుకాల్చి వాత పెట్టడం తథ్యం” అని బండి సంజయ్ హెచ్చరించారు.

Read More

One thought on “తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి? బండి సంజయ్ ప్రశ్నలు

Comments are closed.