అమెరికాలో తెలుగు విద్యార్థి ప్రవీణ్ దారుణ హత్య

27year old

తెలంగాణకు చెందిన యువ విద్యార్థి గంపా ప్రవీణ్‌ (27) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. మిల్వాకీ నగరంలోని ఓ స్టోర్‌లో రాబరీ ఘటన చోటుచేసుకోగా, దొంగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రవీణ్‌కి తూటా తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ప్రవీణ్, మిల్వాకీలోని ఓ స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు.

WhatsApp కాల్.. తండ్రికి కడసారి ప్రయత్నం

రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అతని తండ్రి రాఘవులు మాట్లాడుతూ.. “ఉదయం 5 గంటల సమయంలో ప్రవీణ్‌ నుంచి ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. కానీ ఆ సమయంలో అందుకోలేకపోయాను. కొంతసేపటి తర్వాత కాల్ మిస్సయిన విషయం గుర్తొచ్చి, వాయిస్ మెసేజ్ పంపాను. కానీ గంట గడిచినా ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తిరిగి కాల్ చేసినప్పుడు ఓ వ్యక్తి ఫోన్‌కి సమాధానం ఇచ్చాడు. అపరిచిత వ్యక్తి అవడంతో నేను కాల్ కట్ చేసేశాను” అని భావోద్వేగంగా చెప్పాడు.

**దోపిడీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్

తర్వాత ప్రవీణ్ తండ్రి రాఘవులు తన కుమారుడి గురించి తెలుసుకునేందుకు అతని స్నేహితులను సంప్రదించారు. అప్పుడే ఆయన విన్న విషాదకర సమాచారం వెలుగులోకి వచ్చింది. “ప్రవీణ్‌ స్టోర్‌కి వెళ్లిన సమయంలో అక్కడ దొంగలు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతనికి తూటా తగిలింది. ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు” అని ఆయన కన్నీటి మధ్య తెలిపారు.

ప్రవీణ్ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారికంగా ప్రవీణ్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read More